మైదా పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? తింటే ఏమవుతుందో తెలుసా?

 పిండి వంటలు, టిఫిన్ల కోసం ఈ మధ్య అందరూ బియ్యం పిండి, గోధుమ పిండి, మైదా పిండి వంటి పదార్థాలు వాడుతున్నారు. బియ్యం పిండి బియ్యం నుంచి, శనగ పిండి శనిగల నుంచి, గోధుమ పిండి గోధుమల నుంచి వస్తాయని తెలిసిందే.

మరి మైదా పిండి ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మైదా పిండి గోధుమ పిండి నుంచే తయారవుతుంది. మరి దీనికోసం ఏం చేస్తారో తెలుసా?

గోధుమలను మిల్లులో బాగా పోలిష్ చేస్తారు. ఈ పోలిష్ చేసిన గోధుమలను పిండి చేసి.. అజో బై కార్పోనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు. వీటివల్లనే మైదా పిండి తెల్లగా మెత్తగా ఉంటుంది. నిజానికి ఈ బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని చైనా, ఐరోపా దేశాలలోను పూర్తిగా నిషేధించారు. ఇంకా ఈ మైదా తయారీలో అల్లోక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు. అయితే ఈ మైదా పిండిని చాలా దేశాల్లో నిషేధించారట.

ఎన్ని దేశాల్లో నిషేధించిన దక్షిణ భారత్ లో మాత్రం మైదాను ఎక్కువ వంటకాలలో ఉపయోగిస్తున్నారు. తడి తగిలితే మైదా జిగురు పదార్థంలో మారుతుంది. అందుకే దీనిని హోమ్ మేడ్ గమ్ గా ఉపయోగిస్తుంటారు. అలాంటి పదార్థాన్ని వావ్, సూపర్, నైస్ అంటూ రవ్వ దోశలు, మిఠాయిలు, బ్రెడ్, బొప్పట్లు అంటూ వంట పదార్థాలు తయారు చేసుకుంటూ తింటారు. బేకరీలో దొరికే ఫుడ్ బిస్కట్లు, చిప్స్, ఇవి కాక టిఫిన్ సెంటర్ లలో దొరికే పరోటా, బొడా ఇలా చెప్పుకుంటూ పోతే మన పొట్టను గుల్ల చేసే మైదా పదార్థాలు చాలానే ఉన్నాయి.

ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మైదా పిండిన తమ వంటలలో ఎక్కువ వాడేవారు అధికంగా మధుమేహ సమస్యలను ఎదుర్కొంటారు. ఇవేకాక కిడ్నీల్లో రాళ్లు, గుండె జబ్బులు, రావడం వంటి సమస్యలు కూడా ఈ మైదాను వాడడం వల్ల కలుగుతుంటాయట. అందుకే మైదాను తగ్గించండి ఆహారాన్ని కాపాడుకోండి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS