హుజరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల రమేష్ మంగళవారం బిఎస్పి జిల్లా అధ్యక్షుడు మేకల రవీందర్,, బిఎస్పి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పల్లె ప్రశాంత్, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచాదే వాసాల రమేష్ నియమించారు. హుజురాబాద్ మండలంలో బహుజన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై బహుజన పార్టీ తరఫున ముందుండి పోరాడుతానని అన్నారు. తన నియమాకానికి సహకరించిన బీఎస్పీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ నియామకం పట్ల తన స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.