నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి

కరీంనగర్: జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో న్యూ ఇండియా లిట్రసి ప్రోగ్రాం ప్రారంభంపై సన్నాహక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అమలు తీరు తెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలోని అన్ని శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగుల నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. నిరక్షరాస్యులైన సిబ్బందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక అక్షరాస్యత తరగతులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అధికారులు అంతా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గుర్తించిన నిరక్షరాస్యులకు ప్రేరణ కల్పిస్తూ వారికి చదవడం, రాయడం సంఖ్యా పరిజ్ఞానం కల్పించేలా చూడాలన్నారు. సమష్టి కృషితోనే అక్షరాస్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, వయోజన విద్య ఉపసంచాలకులు ఏం జయశంకర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్ , డిపిఓ రవీందర్ , డిఆర్డిఓ శ్రీధర్ , జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్ వై కే కోఆర్డినేటర్ వెంకట రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ మధులత, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS