వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

వ్యాయామం మానసికోల్లాసానికి తప్పనిసరి

దినచర్యలో ఒక భాగం చేసుకోండి

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు

 

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఉల్లాసంగా, ఉత్సాహంగా 5కే రన్

మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేసిన కలెక్టర్

 

కరీంనగర్: వ్యాయామంతోనే మానసికోల్లాసం తోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వ్యాయామాన్ని దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని మానేరు డ్యాంపై 5కే రన్, వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై 5కే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి రోజూ శారీరక వ్యాయామాన్ని చేయాలని సూచించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. బాధ్యత లు, పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. ఫిట్నెస్ ఫై కరీంనగర్ ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించేందుకు కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్టు అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి మాట్లాడుతూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనే ఉద్దేశంతో 5కే రన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న మహిళలు తమ దినచర్యలో సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ భాగం చేసుకోవాలని కోరారు. “తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్” ప్రతినిధులు మంచినీరు, స్నాక్స్ అందజేశారు. సైక్లింగ్లో రాణిస్తున్న మహిళా సభ్యులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జెండా ఊపి 5 కే రన్ ను ప్రారంభించారు. వాకర్సు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. వారితో కలిసి కలెక్టర్ దాదాపు మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి పద్మావతి, కరీంనగర్ రన్నర్స్ అండ్ సైకిలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు పసుల మహేష్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత, వన్ టౌన్ సిఐ సరిలాల్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, రన్నర్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు విమల, హేమ భట్, స్వప్న, గాయత్రి ,గీతిక, కావ్య, ఉషా ఖండాల్, రవీందర్, శివ, రోహిత్, సంతోష్, శేఖర్, కిరణ్, అజయ్ ఖండాల్, అఖిల్, పరుశరాం, గులాబ్ సింగ్ చౌహాన్, శ్రీనివాస్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS