హుజురాబాద్: పదవతరగతి వార్షిక పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హుజురాబాద్ మండల విద్యాధికారి కేతిరి వెంకట నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18, సోమవారం నుండి నిర్వహించే పదవతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా అన్ని సౌకర్యాలతో మండలంలో ఐదు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఎంఈఓ తెలిపారు. హుజరాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన లో 153 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 170 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 180 మంది, మాంటిసోరి లో 144 మంది, చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 190 మంది పరీక్ష రాయనున్నారు. మొత్తం పది పరీక్షకు 837 రెగ్యులర్, 33 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నారు. ఐదు పరీక్షా కేంద్రాలలో న్యూ శాతవాహనలో 11 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 11 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11 మంది, మాంటిసోరి లో 11 మంది, చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు తెలిపారు. తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు సకాలంలో పంపించాలంటూ తల్లిదండ్రులకు విద్యాధికారి విజ్ఞప్తి చేశారు.