రైతులకు నీళ్లు ఇస్తారా.. గేట్లు ఎత్తమంటారా.. తేల్చుకోండి!

  • రైతును ఏడిపించిన రాజ్యం బాగుపడదు
  • కెసిఆర్ దిగిపోగానే రైతులను కాంగ్రెస్ ఆగం చేస్తుంది
  • నీలివ్వకుండా ఓట్ల కోసం వస్తే ప్రజలు ఉరికిస్తారు
  • హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్, ఏప్రిల్ 03:  తెలంగాణ రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని, నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ సకాలంలో నీళ్లు అందించగా పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కెసిఆర్ హయాంలో గత పది సంవత్సరాలుగా నీళ్ల కోసం రైతులు ఏనాడు రోడ్లు ఎక్కలేదని అన్నారు. కెసిఆర్ పదవి నుంచి పక్కకు తప్పుకోగానే రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకింత అనుభవిస్తుందని అన్నారు. రైతుబంధు పూర్తిస్థాయిలో పడలేదని దాంతోపాటు రైతు బీమా, రుణమాఫీ, బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని అన్నారు. వెంటనే సాగు నీళ్లు ఇవ్వకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ప్రజలు కాంగ్రెస్ నాయకుల్ని ఉరికిస్తారని అన్నారు. నియోజకవర్గం మొత్తంలో ఒక్క ఎకరం ఎండిన చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పిఎస్ సి ఎస్ చైర్మన్ సంపత్ రావు, జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణరావు, పిఎసిఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, మాజీ జెడ్పిటిసి నవీన్, మరి పెళ్లి గూడెం మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ మాజీ సర్పంచ్లు రమేష్ ఏకే తోపాటు రైతులు గ్రామస్తులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS