విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా వీడుకోలు సమావేశం

హుజూరాబాద్: స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం పదవ తరగతి విద్యార్ధుల వీడుకోలు సమావేశం నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి, 10వ తరగతి విద్యార్ధుల తల్లిదండ్రులకు, విద్యార్ధులచే పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డి మాట్లాడుతూ… పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మంచి మార్కులు సాధించాలని, వారినీ ఆనందింపచేయాలని తెలిపారు. పాఠశాల వెల్ విషర్ జయవర్ధన్ మాట్లాడుతూ.. గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉందని, మంచి మార్కులు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు మాట్లాడుతూ… తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పి, మంచి పౌరులుగా తయారు చేసేందుకు కృషిచేసిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, ట్రస్మా ప్రెసిడెంట్ కోరెం సంజీవరెడ్డి, వెల్ విషర్ జయవర్ధన్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, పలు పాఠశాలల కరస్పాండెంట్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS