హుజురాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 12న రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బూత్ అద్యక్షులు సమ్మెలనం, సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంనకు ముఖ్యతిధిగా కేంద్రహోంశాఖ మంత్రి అమితాషా పాల్గొని మార్గదర్శనము చేయనున్నా సమావేశం విజయవంతం కోసం హుజురాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు గంగిశెట్టి రాజు అధ్యక్షతన పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అద్యక్షులు గంగాడి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ … బూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా సమ్మెలనం విజయవంతం కోసం ప్రతి ఒకరు కృషి చేయాలనీ కోరారు. సమావేశ అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్ కు నివాళులు అర్పించి వారి ఆత్మ కు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వినర్ మాడ గౌతంరెడ్డి, జిల్లా కార్యదర్శి, పట్టణ ఇంచార్జీ నరసింహరాజు, జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యం రావు, కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, జిల్లా పదాధికారులు, పట్టణ కమిటీ నాయకులు, వివిధ మోర్ఛ అద్యక్షులు, శక్తికెంద్ర ఇంచార్జీ లు, బూత్ అద్యక్షులు పాల్గొన్నారు.