అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్
– పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగారం ప్రేమ్ కుమార్.
హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని దమ్మక్కపేట గ్రామంలో తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అంబేద్క ర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… న్యాయ వాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధి కారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని అన్నారు. ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటోందని వారు అన్నారు. కేకులు కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగారం ప్రేమ్ కుమార్ , ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బోరుగాల సమ్మయ్య (సారయ్య), ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లూరి రఘుచారి, కోశాధికారి బోరుగాల సునీల్ ఉపాధ్యక్షుడు ఇల్లందుల సమ్మయ్య,(పోస్టు) 8వ వార్డు కౌన్సిలర్ బొరుగాల శివకుమార్, 9వ వార్డ్ కౌన్సిలర్ మెరుగు కొండల్ రెడ్డి, హుజురాబాద్ అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులు ఎండి.ఖాలీద్ హుస్సేన్, జ్యోతి బాపూలే అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రావ్ కమిటీ అధ్యక్షులు రొంటాల సుమన్, సీనియర్ అడ్వకేట్ ముక్కెర రాజు, సింగాపూర్ ఎంపిటిసి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం కాజీపేట శ్రీనివాస్, సమ్మిరెడ్డి సీనియర్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.