కరీంనగర్: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 23 వరకు నిర్వహించిన పోషణ్ పక్షోత్సవాల నిర్వహణలో కరీంనగర్ జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో ఉత్తమ సేవలు అందించిన జిల్లా కో`ఆర్డినేటర్ ఇ.నాగరాజు, ప్రాజెక్టు అసిస్టెంట్ జి.రొమీల, హుజురాబాద్ సిడిపిఓ తిరుపతమ్మ, సూపర్వైజర్ శిరీష, బ్లాక్ కో`ఆర్డినేటర్ కె.నాగరాజు, అంగన్వాడీ టీచర్ కరుణ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి మాట్లాడుతూ పోషణ్ పక్వాడ`2024 కార్యక్రమాల నిర్వహణలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు కృషి చేసిన సిడిపిఓలు, సూపర్వైజర్లు, డి.పి.ఏలు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు.