తాగునీటికి ఇబ్బందులు రానివ్వకండి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించండి..

మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోండి..

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో RWS కొత్తగా వేసిన బోర్ వెల్, నర్సరీ ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులతో కొత్తగా వేసిన తాగునీటి బోర్ వెల్, ట్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. బోరు ఎన్ని ఫీట్లు వేశారు.. గ్రామంలో ఎన్ని ట్యాంకులు ఉన్నాయి.. వాటి సామర్థ్యం ఎంత..ఎక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.. అని అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మార్చి 31 లోపు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని, లేకపోతే నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ అంశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఇదే గ్రామంలో నర్సరీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలు.. ఏమేం మొక్కలు ఎక్కువగా పెంచుతు న్నారని సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పూల మొక్కలు, బెండ తోటను పరిశీలించారు. చాలా చక్కగా పెంచుతున్నారని సిబ్బందిని అభినందించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు వాడిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణ పైనే ప్రత్యేక దృష్టి సారించాలని, హరితహారానికి అన్ని మొక్కలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరు.. ఏమేం పనులు చేపట్టారని తెలుసుకున్నారు. వేసవి కాలం నేపథ్యంలో ఉదయం పూటనే కూలీలతో పనులు చేయించాలని అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ సూర్య ప్రకాశ్, మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ ప్రభాకర్, ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి, ఆర్ఐ వాస్తవిక్, పీఆర్ ఏఈ రమణారెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS