హుజూరాబాద్ పట్టణ కటిక సేవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని కటిక సేవ సంఘం సభ్యులంతా సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా కోయల్ కార్ రమేష్, అధ్యక్షులుగా మిర్యాలకార్ చందాజీ, ఉపాధ్యక్షులుగా కోయల్ కార్ దుర్గాజీ, కార్యదర్శిగా కోయల్ కార్ బాలాజీ, సంయుక్త కార్యదర్శిగా రావులకార్ యాదగిరి, కోశాధికారిగా కోయల్ కార్ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా జమాల్పూర్ అనిల్, కోయల్ కార్ సాయిరాంలతో పాటు ముఖ్య సలహదారులుగా కోయల్ కార్ శ్రీనివాస్, గోగికారి తుక్కాజీ, జమాల్ పూర్ సంతోష్, ఆన్ కార్ రమేష్, కోయల్ కార్ శ్రీనివాస్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.