హుజురాబాద్, ఏప్రిల్5: హుజురాబాద్ మండలంలో రైతులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ లో బిజెపి నాయకులు రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా గంగిశెట్టి రాజు మాట్లాడుతూ… మండలంలో కొన్ని చోట్ల సరైన సమయంలో సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయని, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని, పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదని, వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నేర్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి బింగి కర్ణాకర్, పట్టణ ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్, తూర్పాటి రాజు, సంజీవ రెడ్డి, యంసాని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, రేణుక, బోరగాల సారయ్య, కొలిపాక వెంకటేష్, భాస్కర్ యాదవ్, యాట రాజేష్, మధిర రమేష్, ఆవుల సదయ్య, కుసుమ సమ్మయ్య, నీలం రవీందర్, సారంగపాని తదితరులు పాల్గొన్నారు.