ఎంఐఎఫ్ తరఫున ఆర్ధిక సహాయం

హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన మాడుగుల ప్రవీణ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ప్రవీణ్ తల్లి గతంలోనే చనిపోయింది. ఇప్పుడు ప్రవీణ్ మృతి వల్ల ఆయన భార్య ఒంటరిగా మిగిలింది, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, తమ్ముడు ఉన్నారు. పేదరికంలో ఉన్న ఈ కుటుంబ పరిస్థితులను చూసి చలించి పోయిన హుజురాబాద్ మాదిగ మేధావుల ఫోరం సభ్యులు తమ వంతు బాధ్యతగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయుటకు ముందుకు వచ్చారు. శుక్రవారం ఎంఐఎఫ్ తరఫున రూ.11,500 ను ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేసి భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని నైతిక మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవవాధ్యక్షులు వేల్పుల రత్నం, అధ్యక్షులు ఆడేపు సురేందర్, ప్రధాన కార్యదర్శి రొంటాల సుమన్, కోశాధికారి మట్టెడ ప్రకాష్, ప్రచార కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకట రాజం, మోరే కుమార్, బొడ్డు అయిలయ్య, కండే తిరుపతి, బత్తుల రాజలింగం, మాడుగుల విజయ్ కుమార్, మాడుగుల శివ, పర్లపల్లి రామాంజనేయులు, మేకల మల్లేష్, ఎర్ర శ్రీధర్, ఎర్ర రాజకుమార్, మాడుగుల సాగర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS