ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం

• పార్టీలకతీతంగా పనిచేస్తా

•తాగు, సాగునీటి ఇబ్బందులు తీరుస్తా..

• గ్రామాల్లో తాగునీటికి ఏ ఒక్కరూ ఇబ్బందులు పడొద్దు

• నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది..

• పాఠశాలల్లో ఏది కావాలన్నా చేయిస్తా..

• విద్యకు సర్కారు అధిక ప్రాధాన్యం

• వైద్య పరంగా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాం

• బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 

• సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

• జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరు

 

 

కరీంనగర్: పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గ్రామాల్లో తాగునీటికి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇందుకు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం సైదాపూర్ మండలం వెన్కపల్లి గ్రామంలో మండలానికి సంబంధించి దాదాపు కోటి రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. అమ్మన గుర్తి గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో చేపట్టనున్న 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వెన్కపల్లిలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి కోసం ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం దాదాపు మూడున్నర కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూస్తానని తెలిపారు. విద్యకు సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, పాఠశాలల సమాగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. పాఠశాలలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, టాయిలెట్ల నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు వైద్య పరంగా సేవలందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పాఠశాలల్లో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు. ఆయా గ్రామాల్లో మంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మన గుర్తి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన కాయిత యాదగిరి రెడ్డిని మంత్రి ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేంద్ర, ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ గంగాధర్, ఎంపీటీసీలు జంపాల సంతోష్, లంక దాసరి అరుణ, ఓదెలు, చాంద్ పాషా, మల్లేశం, ఎంపీడీవో యాదగిరి, తహసిల్దార్ మంజుల, నాయకులు సుధాకర్, గుండారపు శ్రీనివాస్, కిష్టయ్య భాస్కర్ రెడ్డి, రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS