<span;>హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో 16 ఏళ్ళ తర్వాత ఫ్రెండ్ షిప్ డే రోజున అప్పటి ప్రధానోపాధ్యాయులు అంకతి జనార్దన్ అధ్యక్షతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2007-08 లో ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఒకే దగ్గిర సమ్మేళనం అయి వేదిక పైన గురువులు నేర్పిన అప్పటి స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మారు మూల గ్రామాల నుండీ వచ్చిన మాకు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పి.. హింది, ఇంగ్లీష్ లో ఇప్పుడు ఎక్కడైనా ప్రావీణ్యంగా మాతో మాట్లాడిస్తున్న గురువులను ఏనాడూ మర్వమన్నారు. మీరు చెప్పిన దైర్యం, తెలివితోనే మా గ్రామాల్లో సమాజ సేవల్లో నిమగ్నం అయ్యామని పూర్వ విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమం లో పూర్వ ఉపాధ్యాయులు రంగు ప్రభాకర్, వెంకట్రాంరెడ్డి, నల్ల మహేందర్, జతనం వెంకట నర్సయ్య, అరిగెల సమ్మయ్య, గిరిజా దేవి, వనజ, లక్ష్మి, రంగు దామోదరా చారి, తాళ్లపెల్లి అమరేందర్, వార్డెన్ తిరుపతి రెడ్డి, వార్డెన్ ఉమా.. విద్యార్ధినీ విద్యార్థులు ముషం శ్రీనివాస్, ఆడేపు వంశీ, ఇల్లందుల రాజేష్, బోటికే కిరణ్, ఎండీ రసూల్, ఎండీ కరీం ఖాన్, కొండ్ర సంపత్, శనిగరపు సతీష్, ఇస్నపు నరేష్, మిడిదొడ్డి ప్రశాంత్, మిడిదొడ్డి నాగరాజు, గడిపె వినోద్, బత్తుల సతీష్, మోలుగురి స్రవంతి, సొల్లు శృతి, గొడిశాల శిరీష, కనకం స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.