హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఐదు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులు

హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలనుండి తెలుగు, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, గణితం… ఐదు సబ్జెక్టులు జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి. ఇందిరాదేవి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… కళాశాల నుండి తెలుగు, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, గణితం సబ్జెక్టులు జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. ఈసందర్భంగా జిజ్ఞాస పర్యవేక్షక ఉపన్యాసకులు ఎస్.మధు (తెలుగు), డా.జి. శ్రీనివాస్ (కామర్స్), ఎస్. శ్యామలాదేవి(ఎకనామిక్స్), ఎస్.సమ్మయ్య(హిస్టరీ), డి.స్వరూపరాణి (గణితం), జిజ్ఞాస పరిశోధక విద్యార్థులను ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పి.లక్ష్మీనరసింహమూర్తి, ఐక్యుఎసి కోఆర్డినేటర్ డా.పి.దినకర్, స్టాఫ్ సెక్రటరీ కె.రమేష్, అధ్యాపకులు, ఉదయశ్రీ, గొడిశాల పరమేష్, హరి ప్రసాద్, రాజ్ కుమార్, నాగ పరమేశ్వరా చారి, స్వప్న, అధ్యాపకేతర సిబ్బంది రాజ్ కుమార్, రమేష్, శ్రీలత, స్పందన, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS