పెరిక కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హుజురాబాద్ పెరిక సంఘం హర్షం

హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హుజురాబాద్ పెరిక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హుజురాబాద్ పెరిక సంఘం మండల అధ్యక్షులు మీస రమేష్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెరిక కులస్తులను గుర్తించి ఎన్నో దశాబ్దాల కలను సాకారం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెరిక కార్పోరేషన్ ద్వారా పెరిక కులస్థులకు అన్ని విధాల న్యాయం జరిగేలా నిధులు మంజూరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్, భారత ప్రభాకర్, అంకతి శ్రీనివాస్, భారత రజనీకాంత్, సంధ్యల వెంకన్న, ముక్కెర కనకయ్య, ఉగ్గే పరమేశ్వర్, పోతరాజు వీరయ్య, శ్యామసుందర్, విజయ భాస్కర్, రాజయ్య, లక్కర్సు యాదగిరి మైదాంశెట్టి శివ, సంధ్యల రఘువర్ధన్, బండి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS