హుజురాబాద్ పట్టణానికి చెందిన దళిత బిడ్డ మెట్టుపల్లి రవీందర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం కష్టపడి చదివి తన కల నెరవేర్చుకున్నాడు. రవీందర్ ప్రస్తుతం హుజురాబాద్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ, అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2023 ఆగస్టు 24న తన తండ్రి మొగిలి మృతిచెందినా కుంగిపోకుండా కష్టపడి చదివి ఇటీవల సర్కారు ప్రకటించిన గురుకుల విద్యాలయ జేఎల్ (పాలిటికల్ సైన్స్), పీజీటీ, టీజీటీ (సోషల్ స్టడీస్) కొలువులు సాదించాడు. ఒకేసారి మూడు ఉద్యో గాలు పొందడంపై పలువురు న్యాయవాదులు, తన స్నేహితులు అభినందలు తెలిపారు.