కరీంనగర్: గ్రూప్స్ ఉచిత శిక్షణ కు గడువు పొడిగింపు

ఈ నేల 12 వరకు గడువు పొడిగించినట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల12వ తేదీ లోగా నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ అర్తత కలిగిన ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగయువతీ, యువకులు దరఖాస్తుచేసుకోవాలన్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించరాదన్నారు. దరఖాస్తుతో పాటు ఎస్ఎస్సీ, ఇంటర్,డిగ్రీ, లేటెస్ట్ కుల,ఆదాయ ద్రువపత్రాలు ఆధార్ కార్డ్, మూడు ఫొటోలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థిల ఎంపిక రిజర్వేషన్, డిగ్రీలో వచ్చినమార్కులు, రూల్ ఆఫ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుందని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్ : 0878 – 2268686 లో… బీ.సి.స్టడీ సర్కిల్ నూతన భవనముఐటి టవర్ పక్కన, కరీంనగర్ కార్యాలయం ఆఫీసు వెళ్లల్లో సంప్రదించాలని సూచించారు.

సూచన:- (09’10 తేదీలలో దరఖాస్తులు తిసుకొనబడును.)

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS