హుజురాబాద్ జర్నలిస్టుల నివేషణ స్థలాల సమస్యను పరిష్కరించాలని సీఎం కార్యాలయానికి లేఖ

మైత్రి న్యూస్:  హుజురాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తున్న హుజురాబాద్ మండల జర్నలిస్టులకు కేటాయించిన నివేషణ స్థలంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలంటూ సమస్యలతో కూడిన వినతి పత్ర లేఖను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పోస్టల్ కార్యాలయంలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరు సాయి కృష్ణ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఆదేశాలతో పట్టాలు వచ్చాయని, అందులో నిర్మాణాలు కూడా పూర్తి చేశామని దానిపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి ఈఎన్ సీ ఇవ్వాలని కోరుతూ లేఖ పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు చిలుకమారి సత్యరాజ్, కేదాసి శ్రీధర్, సమ్మెట సతీష్, పబ్బ తిరుపతి, గోపగోని మహేష్, ఎడ్ల కుమార్, మహ్మద్ అబ్దుల్ ఫహిం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS