ఎంఆర్పీఎస్ సదస్సును విజయవంతం చేయాలి

హుజురాబాద్, ఏప్రిల్ 13: కరీంనగర్ పార్లమెంట్ పరిధి ఎంఆర్పీఎస్ సమావేశం ఏప్రిల్ 14, ఆదివారం సిరిసిల్లలో జరుగనుందని ఈ సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్రం పిలుపునిచ్చారు. శనివారం ఎంఆర్పీఎస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రుద్రారపు రామచంద్రం మాట్లాడారు. సిరిసిల్ల సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ హాజరవుతున్నారని, ఈ సదస్సును జయప్రదం చేయుటకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎంఆర్పీఎస్, ఎంఎస్పి, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, యువసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి రవీందర్, హుజురాబాద్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొరగాల రాజ్ కుమార్, నాయకులు కలవల మల్లయ్య, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, మోరే సతీష్, రుద్రారపు రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS