ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాదిగ, ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ను ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రిమండలి సభ్యులకు తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ ఆధ్వర్యంలో మాదిగ, ఉపకులాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. అనంతరం ఇమ్మడి దయాకర్ మాట్లాడుతూ… దళిత కులాలలో వెనుకబడిన మాదిగ, ఉపకులాలను ముఖ్యమంత్రి గుర్తించి అన్ని రంగాలలో ఆయా కులాలను అభివృద్ధి చేయుటకు ప్రత్యేక కార్పొరేషన్ ను ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిదంగా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కూడా కేటాయించి అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వేల్పుల రత్నం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిప్పారపు భువన చంద్ర, ఎర్ర కుమార్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, మాడుగుల ఓదెలు, కంకణాల జనార్దన్ రెడ్డి, పల్లె మోహన్ రెడ్డి, సత్తి రెడ్డి, పోతారం అశోక్, బొడ్డు ఐలయ్య, దాట్ల ప్రభాకర్, ఆకునూరి అచ్యుత్, బొడ్డు సంపత్, రామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS