ఎల్కతుర్తి, మైత్రీ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన క్యాట్ (నాలేడ్జ్ అసెస్మెంట్ టెస్ట్) ఒలంపియాడ్ పరీక్ష ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారు. మొదటి లెవల్ పరీక్షలో 79 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి రెండో లెవల్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పాకాల రాజు రెడ్డి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజు రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక విద్యా విధానాలకు అనుగుణంగా క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించడంలో శ్రీ చైతన్య ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇలాంటి పోటీలు విద్యార్థులు మేధొవికాసానికి ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, డీన్ రజనీకాంత్, సీ బ్యాచ్ ఇంచార్జ్ మధు, ఒలంపియాడ్ ఇంచార్జ్ కావ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.