అ’పూర్వ’ సమ్మేళనం…

  • పాతికేళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
  • భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక

 

హుజురాబాద్, మైత్రి న్యూస్: సరిగ్గా 25 వేల క్రితం విడిపోయిన స్నేహితులు ఒక్కసారిగా అంతా ఒక వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. ఒకరినొకరు ‘అరేయ్’ అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ మరోసారి ఒకరినొకరు పరిచయం చేసుకున్న సంఘటన ఆదివారం హుజురాబాద్ లోని మధువని గార్డెన్లో జరిగింది. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో 1988-89లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మరోసారి కలవడానికి నిశ్చయించుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతోపాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. చాలా సంవత్సరాలుగా విడిపోయిన స్నేహితులతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ తాము ప్రస్తుతం ఉన్న హోదాలను చెప్పుకుంటూ వచ్చారు. అనంతరం వాళ్లంతా కలిసి చేసిన సందడి చూస్తే వాళ్ళ వయసును మర్చిపోయి మళ్లీ పాతికేల్ల క్రితం ఎలా అయితే ఆకతాయిగా ఉన్నారో అదే తరహాలో ఎంజాయ్ చేశారు. గతంలో జరిగిన సంఘటనన్ని నెమరు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేశారు. అప్పటి విద్యార్థుల మాదిరిగానే ఇప్పుడు గురువులు చెప్పే విషయాలను కూడా అంతే శ్రద్ధగా విన్నారు. గురువుల కంటే పై హోదాలో ఉన్న శిష్యులను చూసి ఆ గురువులు మురిసిపోయారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉన్నట్లే విద్యార్థులు కూడా గురువులకు ఆ గౌరవం ఇచ్చారు. మరోసారి వారి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. అంతా సందడి మధ్యన సాయంత్రం అయిపోయింది. ఇక స్నేహితులు ఒకరికొకరు సెలవు చెప్పుకునే సమయం మొదలైంది అంతే బరువెక్కిన గుండెలతో ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఒకవైపు సంతోషాన్ని మరోవైపు భావోద్వేగంతో పయనమయ్యారు. చివరిగా వాళ్ల ముఖాల్లో ఒకే ఒక సంతోషం ఎందుకంటే ఇక మీద ఎవరి కుటుంబంలోనైనా శుభకార్యం జరిగితే మళ్లీ అంతా కలిసి వెళ్లాలని వారు ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందమే ఆ సంతోషానికి కారణమైంది.

 

  • ఈరోజు నా జీవితంలో మరుపు రానిది: పిట్ట శ్రీనివాస్

నా జీవితంలో ఎన్నో సంతోషకరమైన రోజులు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం నా జీవితంలో మరుపు రానిది. ఎంతమంది స్నేహితులు ఉన్నా చిన్ననాటి స్నేహితుల స్థానం గుండెల పదిలంగా ఉంటుంది. 25 సంవత్సరాలుగా నా స్నేహితులను చూడని బాధ ఈరోజుతో తీరి పోయింది. ఇకమీద ప్రతి శుభకార్యంలో మేమంతా కలుస్తామని హామీ ఇచ్చుకున్నాం. అది చాలా సంతోషంగా ఉంది.

 

  • చిన్ననాటి స్నేహితులను కలవడం సంతోషంగా ఉంది: సృజన

25 ఏళ్ల క్రితం వదిలి వెళ్లిన స్నేహితులను ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. పదవ తరగతి స్నేహితులను కలిసిన వెంటనే పాత జ్ఞాపకాలు మొత్తం గుర్తుకు వస్తున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఒక కుటుంబంలో అంతరం కలిసి ఉండడం అందులో గురువులు కూడా రావడం ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ప్రతి విద్యార్థి ఇలానే తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇదే తరహాలో మా పిల్లలను కూడా స్నేహితులతో కలిసేలా ఉండాలని చెబుతా. ఈరోజు కలిసి వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ కలిసినందుకు రెట్టింపు సంతోషంగా ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS