శ్రీ చైతన్య విద్యా సంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్
• సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత
• మూడు గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు
• శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం పద్మాకర్
ఎల్కతుర్తి, మైత్రీ న్యూస్: మూడు గంటల వ్యవధిలో 600 గణిత ఫార్ములాలను ఏకకాలంలో పఠించడం ద్వారా శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు రికార్డు సృష్టించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల వరంగల్ ఏజీఎం పద్మాకర్ తెలిపారు. ఈ నెల 6న బుధవారం సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లో 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈవెంట్లో 20 రాష్ట్రాల నుంచి 10 వేల మంది శ్రీచైతన్య విద్యార్థులు పాల్గొనగా.. అందరూ 3 నుంచి 10 ఏండ్ల వయసున్నవారే కావడం విశేషం. ప్రతిభ కనపరిచిన చిన్నారులకు యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అధికారులు అభినందనలు తెలియజేసి, ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థకు సూపర్ హ్యా ట్రిక్ వరల్డ్ రికార్డ్ పతకాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏజీఎం పద్మాకర్ మాట్లాడారు. యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల పర్యవేక్ష ణలో ఈనెల 6న హైదరాబాద్ మియాపూర్ లోని శ్రీ చైతన్య స్కూల్ లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఇందులో 20 రాష్ట్రాలకు చెందిన సుమారు పది వేల మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా భాగస్వాములయ్యారని ఆయన వివరించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతి నిధులు శ్రీ చైతన్య విద్యా సంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డును ప్రదానం చేశారని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మాట్లాడుతూ… శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత విద్యారంగ చరిత్రలో అద్భుత ఘట్టమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, డీన్ రజనీకాంత్, సి బ్యాచ్ ఇంచార్జ్ మధు, ప్రైమరీ ఇంచార్జీ గౌసియా, ప్రీ ప్రైమరీ ఇంచార్జీ ప్రతిమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.