హుజురాబాద్ పట్టణానికి చెందిన వకుళాభరణం స్వరూప రాణి కి కాకతీయ యూనివర్సిటీ జంతు శాస్త్రంలో డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. స్వరూప రాణి జంతు శాస్త్ర విభాగంలో ” హైడో బయాలాజికల్ స్టడీస్, సర్వే ఆఫ్ ఏవిధానా అండ్ ఇక్తియోఫ్గానా ఆఫ్ లోయర్ మానేర్ డామ్, కరీంనగర్ డిస్ట్రిప్ట్, తెలంగాణ స్టేట్” అనే అంశంపై పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాఫెసర్ టీ.రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో వ్యాసాన్ని సమర్పించింది. ఆమె సమర్పించిన పరిశోధ ఆత్మకమైన వ్యాసాన్ని విశ్వవిద్యాలయం ఆమోదించడంతో ప్రిల్ 25 న డాక్టరేట్ (పి.హెచ్.డి) అవార్డు ప్రధానం చేశారు. స్వరూపరాణి డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు విద్యాభిమానులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.