హుజురాబాద్: శాతవాహన వికల్పలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజురాబాద్ విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. శాతవాహన విశ్వవిద్యాలయ వాణిజశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించబడిన శాతవాహన వికల్ప కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజురాబాద్ వాణిజశాస్త్ర విభాగపు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని కళాశాల ప్రిన్సిపల్ డా.పి.ఇందిరా దేవి తెలిపారు. శాతవాహన వికల్ప కార్యక్రమంలో వ్యాసరచన, జస్ట్ ఎ మినిట్, క్విజ్, నృత్యం, రంగోలి కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రంగోలి పోటీలో కళాశాల విద్యార్థులు మధులత, నిఖిత తృతీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయిలో ప్రదర్శించుటకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థినీ, విద్యార్థులు
అఖిల, స్రవంతి, సాయికుమార్, జశ్వంత్, భవాని, బాలస్వామి, రాజీ, నాగరాజు, రమ్య, యు.స్రవంతి శ్రీవల్లి, మధులత, నిఖితలను కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.ఇందిరా దేవి, పూర్వ ప్రిన్సిపాల్ గొడిశాల పరమేశ్, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి లక్ష్మీ నరసింహమూర్తి వాణిజ్యశాస్త్ర అధ్యాపకులు డా. గంగిశెట్టి శ్రీనివాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా.దినకర్ అధ్యాపకులు ఎస్. మధు, ఉదయ శ్రీ, చారి, సమ్మయ్య, రాజ్ కుమార్, రమేష్, స్వప్న, స్వరూప, బోధనేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.