రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

వెదురుగట్టలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

వెదురుగట్టలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

కరీంనగర్:  రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. సోమవారం చొప్పదండి మండలం వెదురుగట్టలో శ్రీరామ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వరి ధాన్యం బస్తాను తూకం వేసి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ధాన్యం తేమ శాతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. వరి పంట దాదాపు కోతకు వచ్చిందని, కోసిన వెంటనే తేమ శాతాన్ని సరి చూసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లోనే రైతులకు మద్దతు అందుతుందని పేర్కొన్నారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు. నాణ్యత తో తీసుకువస్తేనే ధాన్యానికి మంచి ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, డీసీఎస్ఓ గౌరీ శంకర్, సివిల్ సప్లై డిఎం రజనీకాంత్, అదనపు డిఆర్డిఓ సునీత, డిపిఎం ప్రవీణ్, ఏపీఎం నర్మదా, మండల వ్యవసాయ అధికారి వంశీ, సివిల్ సప్లైస్ డీటీలు ఉషా, కమలేశ్, అధికారులు,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS