జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, కార్యదర్శులు ఎస్ కే సలీమ, బి.జగదీశ్వర్, ఈ. చంద్రశేఖర్ తదితరులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అన్ని కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసేలా కొత్త హెల్త్ కార్డుల విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అక్రెడిటేషన్ కార్డు మీద జర్నలిస్టులను సచివాలయంలోకి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీలో అన్ని పత్రికల సంపాదకులతో పాటు జీవో 239 ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని జర్నలిస్టు యూనియన్లకు మీడియా అకాడమీ సభ్యత్వం కల్పించాలని వారు సీఎం ను కోరారు. మహిళా జర్నలిస్టుల, చిన్న, మధ్య తరహా పత్రికల సమస్యలను పరిష్కారించాలని అన్నారు. ఇందుకు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS