ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్‌

“ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్‌. ఈ హైదరాబాద్‌ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్‌ అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అందుకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

 

ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు.

 

✅ పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2 ను తీసుకొస్తున్నాం.

✅ ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరిస్తున్నాం. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్‌ను ఏర్పాటు చేస్తాం

✅ మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. దీనికోసమే అక్బరుద్దీన్‌తో కలిసి లండన్ థెమ్స్ నగరాన్ని సందర్శించాం.

✅ చంచల్‌గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం.

 

గండిపేట నుంచి నగరంలోని 55కి.మీ ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం… అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS