హుజురాబాద్: బీసీ ల అభివృద్ధి కి కృషి చేస్తాన్నని బీసీ సంఘం మండల అధ్యక్షుడు పంజాల తిరుపతి అన్నారు. పంజాల తిరుపతి ని బీసీ రాజకీయ పోరాట సమితి మండల అధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చిలకమారి శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ… బీసీ రాజకీయ అధికారం కోసం బీసీ నాయకత్వాన్ని pబలపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తన పై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. బీసీలకు రాజకీయంగా తగిన వాటా సాధించాల్సిన అవసరం ఉందని, బీసీలను చైతన్యపరచి, సాధించుకునే దిశగా ముందుకు సాగుతామని తిరుపతి గౌడ్ తెలిపారు. మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన, హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకరీ మాదవరెడ్డి, ఇల్లందుల తిరుపతి, కోలా సాయికుమార్, చీదురాల శ్రావణ్ కుమార్, చినుమల్ల ప్రసాద్ బాబు, తాండవరం విష్ణుమూర్తి, మురారి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.